UPDATES  

 ఆర్ధిక నేరగాళ్ళకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మోడీ

  • ఆర్ధిక నేరగాళ్ళకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మోడీ
  • అదాని స్టాక్స్ కుంభకోణపై మోడీ భాద్యత వహించాలి
  • జేపిసి వేసి జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలి
  • ఎస్బిఐ ,ఎల్ఐసి, లను లూటీ చేసిన ఆదాని తక్షణమే అరెస్టు చేయాలి
  • సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా
  • సిపిఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్ బిఐ ఎదుట ధర్నా..నిరసన ప్రదర్శన

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 13… ప్రధాని మోడి దేశంలోని ఆర్ధిక నేరాగాళ్ళకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడని, కోట్లాది రూపాయలు దేశ సంపదను, ప్రజా ధనాన్ని దోచుకుంటున్నా మోడీ నోరుమెదకపకపోవడం వెనుక ఆంతర్యమేమిటని సిపిఐ భద్రాది కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా ప్రశ్నించారు. ఆదాని స్టాక్స్ కుంభకోణంలో ఆదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా సోమవారం కొత్తగూడెం ఎసిబిఐ ప్రధాన ద్వారాన్నీ మూసివేసి ధర్నా చేపట్టారు, అనంతరం ఎస్బిఐ నుంచి ప్రధాన సెంటర్లమీదుగా ఏఐటీయూసీ వందేళ్ల స్తూపం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ హిడెన్బర్గ్ నివేదికతో ఆదాని అవినీతి, అక్రమాలు బహిర్గతమయ్యాయని, మోడీ సహకారంతో ఆదాని దేశసంపదను దోచుకొని ప్రపంచ కుభేరుల్లో మూడో వ్యక్తిగా స్థానం దక్కించుకున్నాడని విమర్శించారు. మోడీ ఆదేశాలతోనే ఎస్ బిఐ, ఎల్బీసి సంస్థలు అదాని సంస్థల్లో షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టాయని, హిడెన్బర్గ్ నివేదికతో షేర్ల ధరలు పడిపోయి రెండు రోజుల్లోనే ఎల్ఐసి రూ.18వేల కోట్లు, ఎసిబిఐ రూ.56వేల కోట్లు నష్టపోయి ప్రజలు తమ కష్టార్జితంతో నిర్మించుకున్న ఎల్బీసి, ఎల్ఐసి లను నష్టాల ఊబిలోకి నెట్టివేశారన్నారు. ప్రజాసంపదను కార్పోరేట్లకు దోచిపెట్టే అధికారం మోడీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. భారీ మొత్తంలో కుంభకోణానికి పాల్పడిన ఆదానీ ఉదంతంతో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట దెబ్బతిన్నదన్నారు. దీనిపై ప్రధాని మోడీ నోరెత్తడం లేదని, పైగా సమాధానం చెప్పాలని కోరితే దేశవ్యతిరేక శక్తులకు అంటగడుతూ సమస్యను పక్కదాని పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అతితక్కవ కాలంలో ప్రపంచంలోనే మూడో ఆస్తిపరుడుగా ఎదిగిన ఆదాని అతితక్కవ పన్ను కడుతున్నారని, ఇదేలా సాధ్యమో మోడీ సమాదానం చెప్పాలని, దీనిపై ఇడి ఎందకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంబాలైన ఎస్ఐ, ఎల్బీసి లాంటి సంస్థల మెడపై కత్తిపెట్టి అదానీకి రుణాలు ఇప్పించారని, దీనికితోడు ప్రభుత్వరంగ సంస్థలన్నిటికీ అదానీ చేతిలో పెడుతున్నారని, అదానీ, మోడీ కలిసి దోచుకుంటూ దేశాన్ని గుట్టచేస్తున్నారని విమర్శించారు. దీనిపై జేపిసి వేసి విచారించాలని డిమాండ్ చేశారు. జరిగిన కుంభకోణంపై మోడీ భాద్యత వహించాలని, ప్రభుత్వరంగ సంస్థలను లూటీ చేసిన ఆదాని తక్షణమే అరెస్టు చేయాలని లేనిపక్షంలో ప్రజల ఆగ్రహాన్ని మోడీ చవిచూడకతప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, భూక్య శ్రీనివాస్, కె.రత్నకుమారి, పార్టీ ప్రజా సంఘాల నాయకులు గడ్డం రాజయ్య, బోయిన విజయ్ కుమార్, రాంబాబు, షాహెన్, రాంజి, విజయలక్ష్మి, జ్ఞానయ్య, మోతుకూరి శంకర్, భాగ్యలక్ష్మి, నాగయ్య, బాజోజు రవి, బాబా, పాషా, అబ్బులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !