మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 14… సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ ఆద్వర్యంలో జిల్లాస్థాయి
విజిలెన్స్ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార బద్రతా చట్టం ప్రకారం విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందని, కమిటిలో చర్చించిన అంశాలను తప్పక పాటించాలని చెప్పారు.
కమిటి విధులను కలెక్టర్ వివరించారు. ఆహార బద్రతా చట్టం ప్రకారం సంక్షేమ హాస్టళ్లుతో పాటు ప్రభుత్వం
ఆహారం అందించే అన్ని శాఖలు విజిలెన్స్ కమిటీ పరిధిలోకి వస్తాయని చెప్పారు. నాణ్యతతో పాటు బియ్యం సక్రమంగా పంపిణీ జరిగే విధంగా కమిటి సభ్యులు బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు. రేషన్ బియ్యం తీసుకోడానికి బయోమెట్రిక్ రాని లబ్దిదారుల జాబితా తయారు చేసి ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సమస్యను పరిష్కరించు విధంగా
చర్యలు తీసుకోవాలిని పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. బయోమెట్రిక్ రాని వారికి సెల్ ఫోన్ లకు వచ్చే ఓటిపి ద్వారా బియ్యం పంపిణీ చేయాలని అన్నారు. సాంకేతిక పరమైన సమస్యలుంటే కమిషనర్ దృష్టికి తెచ్చి పరిష్కారానికి
చర్యలు చేపట్టాలని సూచించారు. రేషన్ కార్డులు ఉన్నా బయోమెట్రిక్ లేక బియ్యం రాలేదన్న సమస్య రావొద్దని ఆయన పేర్కొన్నారు. అవకతవకలకు పాల్పడిన డీలర్లుపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రేషన్ దుకాణాలను
సీజ్ చేయాలని చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయబడుతున్న బియ్యం ప్రజలకు సక్రమంగా సరఫరా
జరుగుతున్నదా లేదా పరిశీలన చేయాలన్నారు. చౌకదుకాలణాల తనిఖీపై ప్రతి సోమవారం పౌర సరఫరాల శాఖ డిటిలు నివేదికలు అందచేయాలని అన్నారు. సంక్షేమ అధికారులు వసతిగృహాలను తనిఖీ చేయాలని, మెనూ పాటిస్తున్నారా
లేదా పరిశీలన చేయాలని సూచించారు నాణ్యతపాటించాలని, బ్రతకడానికి పెట్టడం కాదని, నాణ్యత తగ్గొద్దని, నాణ్యత తగ్గితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. విజిలెన్స్ కమిటి సభ్యులు హాస్టళ్లు తనిఖీ చేయాలని అన్నారు. సంక్షేమ
హాస్టళ్లులో మెనూ పాటించాలని తెలిపారు. ఆహార తనిఖీలు నిర్వహించాలని అన్నారు. నూతన రేషన్కార్డులు జారీకొరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్కు నివేదిక పంపాలని సూచించారు. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లులో స్టాకు
పరిశీలన చేయాలని, నిరంతర పర్యవేక్షణ చేయాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం పెట్టొద్దని ఆయన వివరించారు. హాస్టళ్లుకు నిత్యావసర వస్తువులు సరఫరాకు టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్లుకు సరుకులు సకాలంలో
సరఫరా చేయాలని, సక్రమంగా సరఫరా చేయని కాంట్రాక్టర్లును బ్లాకు లిస్టులో పెట్టాలని అదనపు కలెక్టర్కు సూచించారు.ఏడు అంగన్వాడీ ప్రాజెక్టుల్లోని 1058 అంగన్వాడీ కేంద్రాలకు చిరుధాన్యాలు అందచేస్తున్నామని, చిరుధాన్యాలు
సరఫరాలపై నివేదిక అందచేయాలని సంక్షేమ అధికారిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాట్ల ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించాలని
అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పట్టకుండా అర్హులకు అందాలని చెప్పారు.కమిటి సభ్యులు చేసిన సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కమిటికి జిల్లా
కలెక్టర్ ఛైర్మన్గాను, అదనపు కలెక్టర్ వైస్ ఛైర్మన్గాగాను, జిల్లా పౌర సరఫరాల అధికారి కన్వీనర్ గా, జిల్లా అధికారులు, స్వచ్చంద సంస్థల సభ్యులు తదితరులతో కమిటి ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల అధికారి మల్లిఖార్జున్, డిఆర్డిఓ మధుసూదన్ రాజు,జడ్పీ సిఈఓ విద్యాలత, సంక్షేమ అధికారి లెనీనా, పౌర సరఫరాల శాఖ డియం త్రినాధ్బాబు, ఎస్సీ అభివృద్ధి అధికారి
అనసూర్య, గిరిజన సంక్షేమ శాఖ డిడి రమాదేవి, డిఈఓ ప్రసాద్, తూనికలు కొలతల అధికారి మనోహర్, డిటి పాప, బిసి సంక్షేమ అధికారి సురేందర్, దివ్యాంగుల సంక్షేమ సంఘ అధ్యక్షులు సతీష్, రేషన్ దుకాణ డీలర్ సంఘ అధ్యక్షులు
శేఖరబాబు, కమిటి సభ్యులు కొడాలి వెంకటేశ్వరావు, యు క్రిష్ణ, జి కుసుమ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
