మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 14.. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎమ్మెల్యే వనమాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరోసారి రచ్చ కెక్కారు. నీతి నియమాలను వదిలి సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగూడెం పర్యటనకు వచ్చిన సందర్భంగా.. ఆ పర్యటన విజయవంతం చేసేందుకు వసూళ్ల పర్వం మొదలుపెట్టారు. ఆ వసూళ్లకు సంబంధించి ఒక ఆడియో లీక్ అయింది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం వ్యాప్తంగా పలు సంచలనాలు రేపింది. సదరు శాఖ ఏమిటో తెలియదు గానీ ఆ శాఖ తరపున ఐదు లక్షలు వసూలు చేయాల్సి ఉంది మూడు లక్షలు చెల్లించడంతో ఆగ్రహ ఆవేశాలతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తో పాటు తనయుడు వనమా రాఘవేంద్రరావు ఆయన సతీమణి తో పాటు పర్సనల్ పీఏ కూడా చర్చించుకోవడం రచ్చకెక్కింది. ఇటికల కాలంలో వనమా రాఘవేందర్ వేధింపులతో ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాడని చర్చించుకుంటున్న తరుణంలో ఈ ఆడియో లీక్ వనమా కుటుంబానికి చెరగని మచ్చగా మారింది. ముఖ్యమంత్రి కెసిఆర్ జనవరి 18న కొత్తగూడెం వచ్చిన సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి వసూలు చేసినట్లు కొత్తగూడెం వ్యాప్తంగా ఆరోపనలు గుప్పిస్తున్నాయి. మరో రెండు రోజుల వ్యవధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను కొత్తగూడెం వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సారధ్యంలో సన్నహాలు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్తగూడెం రాకతోటే వసూళ్ల పర్వం మొదలుపెట్టిన ఆ ప్రబుద్ధులు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు ఏ మేరకు చందాలు దందాలు వసూలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
