UPDATES  

 పోడుభూములకు పట్టాలివ్వాలి……….. సిపిఎం జిల్లా కమిటి సభ్యులు కొండపల్లి శ్రీధర్………

 

మన్యం న్యూస్ చండ్రుగొండ,ఫిబ్రవరి14:
సాగులో ఉన్న పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం మండల కమిటీ ఆద్వర్యంలో పోడుసాగుదారులు తహసీల్దార్ వర్స రవికుమార్ కు వినతిని సమర్పించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోడుసాగులో గిరిజన, గిరిజనేతరులు ఉన్నారని, వారందరికి హక్కుపత్రాలు ఇవ్వాలన్నారు. సర్వే చేసిన పోడుభూములన్నింటికి పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఐలూరి రాంరెడ్డి, మండల నాయకులు పెద్దిని వేణు, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, తిరుమలయ్య, పోడుసాగుదారులు ప్రతాప్, చింతల భోపాల్, ఉప్పతల గోపాల్, చల్లా క్రిష్ణ, ఏ బాలు, సాల వెంకన్న, బత్తుల రాంబాబు, దేవుళ్ల గోవర్ధన్, రామిశెట్టి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !