మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 14… మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుంజా.రంగయ్య ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించారు. ఆయన దశదినకర్మలకు స్థానిక సర్పంచ్ ఇర్ప.విజయ్ కుమార్ తన మానవత్వంతో మృతుని కుటుంబానికి స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి 50 కేజీల బియ్యం మంగళవారం వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ కుటుంబానికి ఆపద వచ్చిన తనవంతుగా ఎంతోకొంత ఆర్థిక సహాయం అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెను.సాంబయ్య,గుడ్ల.రంజిత్ కుమార్,మల్కం.వెంకటేశ్వర్లు, ముండ్రాతి.రమేష్, ఇర్ప.నాగెష్,సూతరి.నాగేశ్వరరావు,కుంజ.లక్ష్మయ్య,బట్టా. బిక్షపతి,మల్కం.పుల్లయ్య, మెడెం.అంజయ్య,కుంజ.నర్సింహరావు,ఎల్లబోయిన.సత్యం తదితరులు పాల్గొన్నారు.
