UPDATES  

 సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలి.

మన్యం న్యూస్ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర సాధకులు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల. సోమయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు బుధవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అనంతరం తహసిల్దార్ కార్యాలయం కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలోనే మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అభిమానులు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !