మన్యం న్యూస్, మణుగూరు/అశ్వాపురం, ఫిబ్రవరి 15: అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామపంచాయతీ లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొక్క సాంబశివరెడ్డి తండ్రి బొక్క సోమ నర్సిరెడ్డి చిన్నకర్మలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు సతీమణి సుధారాణి హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట లక్ష్మణ్ రావు, గజ్జల లక్ష్మారెడ్డి, సూది రెడ్డి గోపిరెడ్డి, మొగిళ్ళవీరారెడ్డి, వెంగళ సోమిరెడ్డి, మిట్ట కంటి సురేందర్ రెడ్డి, బొక్క రవి, ముస్కు వీరారెడ్డి, హర్ష, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అశోక్ , లంకల రమేష్, శేఖర్, కిరణ్, చిలక వెంకట్రామయ్య, సందీప్ యాదవ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
