మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 17
పినపాక మండల ఇంచార్జ్ మండల అభివృద్ధి అధికారిగా పల్నాటి వెంకటేశ్వరరావు శుక్రవారం నియమితులయ్యారు. గతంలో ఆయన మణుగూరు ఎంపీఓగా విధులు నిర్వహించారు. నూతన ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వరరావును పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, పలు పంచాయతీల సర్పంచులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు