UPDATES  

 మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలి

మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలి
సిఐటియు ఆధ్వర్యంలో పది కిలోమీటర్ల పాదయాత్ర కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన గ్రామపంచాయతీ కార్మికులు గ్రామపంచాయతీ

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20..కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం పాల్వంచ మండలం జగన్నాధపురం పెద్దమ్మ తల్లి గుడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పది కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల తోటి వెట్టిచాకిరి చేయిస్తుందని విమర్శించారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం , పండగ సెలవులను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు ఇవ్వాలని ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న మూడు నుంచి ఐదు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు . పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని బిల్ కలెక్టర్లు, కారోబార్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని సిఐటియు డిమాండ్ చేసింది. .అన్ని పంచాయతీ కార్యాలయాల్లో మహిళా కార్మికులకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని , ప్రతి కార్మికుడికి రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని సిఐటియు డిమాండ్ చేసింది .గోదావరి వరదల సందర్భంగా కష్టపడి పని చేసిన కార్మికులకు ఒక నెల వేతనాన్ని ఇన్సెంటివ్ గా ఇవ్వాలన్నారు. భద్రాచలం పంచాయతీ కార్మికులకు మాత్రమే గోదావరి వరదలు ఇన్సెంటివ్ ఇచ్చి మిగిలిన కార్మికులను విస్మరించడం అన్యాయమని పేర్కొన్నారు . గ్రామపంచాయతీలో 2021 జనాభా లెక్కల ప్రాతిపదికన కార్మికులను నియమించాలని కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని. పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం తగదని అత్యంత అట్టడుగు వర్గాలకు సంబంధించిన కార్మికులు పంచాయతీ కార్మికులని వారి సేవలను మాటల్లో పొగుడుతూ వేతనాలు, సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వం వివక్షత చూపుతోందని విమర్శించారు. ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకపోతే ఫిబ్రవరి 28వ తేదీన జరుగుతున్న చలో హైదరాబాద్ అనంతరం నిరవధిక సమ్మె నిర్వహిస్తామని కార్మికుల సమ్మె నిర్వహిస్తే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఐటియు నేతలు హెచ్చరించారు. గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం సతీష్ కుమార్ అధ్యక్షతన కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరిగింది .ధర్నా అనంతరం నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారికి కు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. పాదయాత్ర సందర్భంగా పాల్వంచలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల విద్యార్థులు పాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు. అనేకమంది సంఘీభావం తెలిపారు ఈ పాదయాత్రలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి సిఐటియు జిల్లా కోశాధికారి జి పద్మ జిల్లా ఆఫీస్ ఆపీసు బెరర్లు గద్దల శ్రీనివాస్, పిట్టల అర్జున్ ,డి వీరన్న ,కే సత్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ రవికుమార్ ,ఉప్పు తల నరసింహారావు, భూక్య రమేష్, సిఐటియు మండల కన్వీనర్లు బర్ల తిరుపతయ్య, నరసింహారావు, నిమ్మల మధు, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్&వర్కర్స్ యూనయన్ నాయకులు సాయి రత్న ,శివకృష్ణ, కళ్యాణ్, తోకలు నరేష్, రంగా, పద్మ , జక్కుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !