మన్యం న్యూస్, మణుగూరు , ఫిబ్రవరి 21 : మణుగూరు ఓసి ప్రభావిత గ్రామాల యువతకు స్థానిక ఓబి కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించాలని పగిడేరు ఎంపీటీసీ కుంజా కృష్ణకుమారి ఓబి కంపెనీల యాజమాన్యాన్ని కోరారు. ఆమె మంగళవారం దుర్గా కంపెనీ యాజమాన్యానికి ఉప సర్పంచ్ దామల్ల దయాకర్ తో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఓసి టు నిర్వాసిత గ్రామమైన శ్రీరంగాపురం, ఓసి ప్రభావిత గ్రామాలు శాంతినగర్, పగడేరు, గొల్ల కొత్తూరులో యువత ఉపాధి అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సింగరేణి యాజమాన్యం ఓబి కంపెనీలు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దుర్గా కంపెనీ యాజమాన్యం వెంటనే స్పందించి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.