మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 21.. అశ్వారావుపేటలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ప్రారంభించిన ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ చేపించుకున్న పేసెంట్లను మంగళవారం పరామర్శించి వారికి పండ్లు, బ్రెడ్ లు అందించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు. ఈ సందర్బంగా పేషెంట్లు ఎమ్మెల్యే మెచ్చాకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఆపరేషన్ చేపించు కోవాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వచ్చేదని, ఇప్పుడూ ఆ ఇబ్బందీ లేదని ఎమ్మెల్యే మేచ్ఛా నాగేశ్వర రావు దయవల్ల నిరుపేద మహిళలకు ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయని, ఇక్కడ పని చేసే ప్రతి ఒక్క డాక్టర్లు చాలా మంచిగా వైద్య సేవలు అందిస్తున్నారని, ఎమ్మెల్యే కి అశ్వారావుపేట మండల ప్రజలు రుణ పడి ఉంటారని వారు అన్నారు. అనంతరం డిసీహెచ్ఎస్ రవి బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే మెచ్చా ప్రత్యేక చొరవతో ఈ ఆపరేషన్ థియేటర్ లోని పరికరాల కొరకు ఎమ్మెల్యే ప్రత్యేక గ్రాంట్ నుంచి రూ. 35 లక్షల రూపాయలు మంజూరు చేయడం వలన త్వరగా అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో అశ్వారావుపేట 100 పడకల ఆసుపత్రిని తీసుకొస్తామని తెలిపారు. అలాగే నూతనంగా నిర్మాణం అవుతున్న డయాలసిస్ బిల్డింగ్ పనులను త్వరగా పూర్తీ చేసేలా చర్యలూ తీసుకోవాలని డాక్టర్స్ నీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, మండల నాయకులు మోహన్ రెడ్డి, డాక్టర్స్ చిట్టిబాబు, పూర్ణ చంద్రరావు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.