మన్యం న్యూస్, చండ్రుగొండ, ఫిబ్రవరి 21..
గర్భీణీలు, బాలింతలు కచ్చితంగా పౌష్టికాహరం తీసుకోవాలని, కౌమరదశలో ఉన్న యువతులు సైతం మంచి ఆహారాన్ని తీసుకోవాలని సిడిపిఓ నిర్మలాజ్యోతి సూచించారు. మంగళవారం మద్దుకూరు గ్రామ శివారులోని గొత్తికోయల గ్రామాన్ని శిశుసంక్షేమశాఖ, వైద్యారోగ్యశాఖలు సంయుక్తంగా సందర్శించి, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పేదలకు వస్తువులు, ఆహరాన్ని, నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. అనాధలైనా చిన్నారులుంటే తమకు తెలియజేయాలని, వారి బాగోగులను చూసుకోవడానికి ప్రత్యేక సెంటర్లు ఉన్నాయన్నారు. రక్తహీనత సమస్య ఉంటే వెంటనే వారికి తగిన ఆహారాన్ని అందించాలని సిబ్బందిని ఆమె ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు రాణి, శకుంతల, వైద్య సిబ్బంది సుశీల, తదితరులు పాల్గొన్నారు.