మన్యం న్యూస్, అశ్వరావుపేట, ఫిబ్రవరి 21… మండల పరిదిలోని ఊట్లపల్లి గ్రామం నందు నూతన అంగన్వాడీ భవనం నిర్మించాలని సర్పంచ్ సాదు జ్యోత్స్నబాయి మంగళవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనీనాకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊట్లపల్లి గ్రామ పంచాయితీ నందు అంగన్వాడీ భవనం శిథిలావస్థలో ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పల్లె ప్రగతి 30 రోజుల ప్రణాళికలో అధికారుల ఆదేశాల మేరకు కూల్చివేయడం జరిగిందని, ఆ రోజు నుంచి నేటి వరకు పంచాయతీలో ఉండే గర్భవతులు, బాలింతలు దాదాపు 30 మంది పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ అద్దె భవనం నందే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందనీ అన్నారు కావునా దయ ఉంచి ఊట్లపల్లి గ్రామానికి నూతన అంగన్వాడీ భవనం మంజూరీ చేపించి ఊట్లపల్లి గ్రామంలో నూతన అంగన్వాడి భవనానికి కృషి చేయవలసిందిగా కోరారు.