మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి21: రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న కల్యాణ లక్ష్మి నిరుపేద కుటుంబాలకు భరోసాను కల్పిస్తుందని పినపాక ఎమ్మెల్యే కాంతారావు అన్నారు. మంగళవారం ఆయన అశ్వాపురం మండలం లో 50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం పేదలకు ఎంత గానో అండగా నిలుస్తుందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో రాష్ట్రంలోని ఎంతోమంది పేద కుటుంబాల ఆడపిల్లలకు పెళ్లి చేసే భారం తగ్గిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.