UPDATES  

 ఐ టి సి సాజన్యంతో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం రూ 7 లక్షల వ్యయంతో నిర్మాణం 24 గంటలు రక్షిత నుంచినీరు సరఫరా.

 

మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి22.. మండలం ఇరవెండి గ్రామంలో వోల్వో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బుధవారం రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. సుమారు రూ. 7 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ పథకం ద్వారా గ్రామస్ధులకు 24 గంటలు మంచినీరు అందుబాటులో ఉంటుందన్నారు. వోల్వో గ్రూపు సీఎస్సార్ పథకంలో భాగంగా మంచినీటి పథకాన్ని నిర్మించినట్లు ఓల్వో సంస్థ డైరెక్టర్ జీవీ రావు తెలిపారు. సారపాకలోని ఐటీసీ సంస్థ సౌజన్యంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా స్థలదాత తాళ్లూరి పంచాక్షరయ్యను అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య, వోల్వో సంస్థ ఉన్నతాధికారులు సుమంత్ కుమార్, వెల్లంకి కృష్ణ కిషోర్, సీహెచ్ గణేశ్, ఐటీసీ యూనిట్ హెడ్ సిద్ధార్థ మొహంతి, హెచ్ఆర్ హెడ్ శ్యాంకిరణ్, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వల్లూరిపల్లి వంశీకృష్ణ, టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, ఐటిసి గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు కనకమెడల హరిప్రసాద్, సర్పంచి కోర్సా లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఆర్. దివ్య తాళ్లూరి రాధాకృష్ణ, మాడపాటి ప్రకాష్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !