UPDATES  

 చెత్త మున్సిపాలిటీ… – పారిశుధ్యమా… అడ్రస్ ఎక్కడ…?

  • చెత్త మున్సిపాలిటీ…
  • – పారిశుధ్యమా… అడ్రస్ ఎక్కడ…?
  • – చెప్పిందంతా అంతా తూచ్
  • – అయ్యా కమిషనర్ సారు ఏంటి మీ తీరు.

మన్యం న్యూస్, మణుగూరు, మార్చి 14: మణుగూరు మున్సిపాలిటీ చెత్త మున్సిపాలిటీగా తయారైంది. ఎక్కడ వేసిన చెత్త అక్కడే దర్శనం ఇస్తుంది. పారిశుద్ధ్యం పనులు మచ్చ కైనా కనిపించడం లేదు. అయ్యా కమిషనర్ సారు ఏంటి మీ పనితీరు అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలోని కొన్ని ఏరియాలలో గత రెండు నెలల నుంచి చెత్త వాహనాలు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త సేకరించేందుకు 50 రూపాయలు వసూలు చేసే దానిపై ఉన్న శ్రద్ధ చెత్త సేకరించడం పై లేదా అంటూ ప్రజలు మండిపడుతున్నారు.

-పాత్రికేయ సమావేశంలో చెప్పిందంతా ఉత్తమాటలేనా…

హడావుడిగా పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి పారిశుధ్యం పై ప్రత్యేక చర్యలు తీసుకుంటానని చెప్పింది ఉత్తి మాటలుగానే మిగిలిపోయాయి. ప్రతిరోజు చెత్త వాహనాలు పంపిస్తానని చెప్పి 20 రోజులు కావస్తున్న చెత్త వాహనాలు కంటికి కూడా కనిపించడం లేదు. అదేవిధంగా మున్సిపాలిటీలో ఎన్ని కుక్కలున్నాయా లెక్క చెప్పి వాటిని పట్టుకునేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించామని చెప్పారే తప్ప వాటి ఆచరించింది మాత్రం లేదు. ఎక్కడ చెప్తే అక్కడ పేరుకుపోయి ఉండడంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజల రోగాల బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మణుగూరు మున్సిపల్ కమిషనర్ పనితీరు ఏ విధంగా ఉందో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రతిరోజు చెత్త వాహనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

-కార్యాలయానికే పరిమితమైన చెత్త వాహనాలు….

మణుగూరు మున్సిపాలిటీ లో ఎంతో ఖర్చు చేసి కొనుగోలు చేసిన వాహనాలు కార్యాలయానికే పరిమితమాయ్యాయి. చెత్త సేకరణ వాహనాలను బయటకు పంపకుండా కార్యాలయంలోనే ఉంచుతున్నారు. ఎంతో ఖర్చు చేసి కొన్న వాహనాలు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. కొన్ని వాహనాలు అయితే తుప్పు పట్టి పోతున్నాయి. ఇంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !