మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సినిమా షూటింగ్ ప్రారంభం
కాచనపల్లి అమరవీరుల స్థూపం వద్ద లాంఛనంగా ప్రారంభించిన చిత్ర బృందం
మన్యం న్యూస్ గుండాల, మార్చి 15 ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ప్రజా పందా పార్టీ సీనియర్ నాయకులు సహజ జీవనశైలి నాయకులు గుమ్మడి నరసయ్య పై తీస్తున్న బయోపిక్ సినిమా షూటింగ్ మండలం పరిధిలోని కాచనపల్లి గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద బుధవారం లాంఛనంగా చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించారు. గుమ్మడి నరసయ్య సినిమా ప్రారంభానికి ముందుగా అమరవీరుల సాక్షిగా తొలి అడుగు ఇక్కడి నుండే అని ఆ తర్వాత దేశం గర్వించదగే విధంగా సినిమాను ప్రజలకు పరిచయం చేస్తామని సినిమా డైరెక్టర్ పరమేష్, ప్రొడ్యూసర్ రాకేష్, మ్యూజిక్ డైరెక్టర్ శరణ్ అర్జున్ తెలిపారు. సినిమా యూనిట్ బృందం కాచినపల్లికి చేరుకునే విషయం తెలుసుకున్న ప్రజాపంద పార్టీ శ్రేణులు పార్టీ రాష్ట్ర నాయకత్వం మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య , చంద్రా అరుణ చిన్న చంద్రన్న ప్రభన్న తదితరుల నాయకత్వంలో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరై వారికి స్వాగతం తెలిపారు. అనంతరం ప్రదర్శన నిర్వహించి స్తూపం వద్ద ఏర్పాటుచేసిన ఎర్రజెండాను ఆవిష్కరించి అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా అరుణోదయ కళాకారులు రాష్ట్ర కార్యదర్శి అజ్మీర బిచ్చ నాయకత్వంలో కళా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ బృందం నుండి కెమెరామెన్ అఖిల్ రైటర్ విశ్వన్ యాక్టర్ భాష మరియు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా నాయకులు బుర్ర వెంకన్న, ఆర్ఎస్సి బోసు డి ప్రసాద్, ఈసం శంకర్, డివిజన్ నాయకులు పూనెం కుమార్,కోరంశాంతయ్య, కాంపాటి ప్రసాద్, బుర్ర రాఘవులు, బొర్రా వెంకన్న, ఎనగంటి గణేష్ రామచందర్ తదితరులు పాల్గొన్నారు.





