మన్యంన్యూస్,ఇల్లందు పట్టణం: ఇల్లందు ప్రజలకు వేసవిలో నీటి ఎద్దడి సమస్య లేకుండా కలుషితాలకు తావులేని నీటిని అందించేందుకు మున్సిపల్ యంత్రాంగం ఆ పనుల్లో నిమగ్నమైంది. గతంలో చెరువు కట్టపై పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి అస్తవ్యస్తంగా ఉండేది. కానీ ఆనాడు చెరువు కట్ట సుందరీకరణలో భాగంగా చెరువుగట్టు ప్రాంతాలలో పిచ్చి మొక్కలు పెరగకుండా ఉండేందుకు ఇల్లందు పురపాలక సంఘం ప్రత్యేక కార్యచరణ ఏర్పాటు చేసి మొక్కలు తొలగించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మళ్లీ చిన్న చిన్న మొక్కలు పెరగడంతో ఇల్లందు పురపాలక వర్గం మున్సిపల్ సిబ్బందితో గురువారం ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టింది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు దగ్గరుండి మరీ పనులను పర్యవేక్షించారు. శానిటేషన్ సిబ్బంది మొక్కలని తొలగించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు మున్సిపాలిటీ శానిటేషన్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, జవాన్లు అంజద్, ప్రకాష్, లక్ష్మణ్, కళ్యాణ్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.