UPDATES  

 వేణుగోపాల స్వామి దేవాలయం లో ధ్వజ స్వంభం పునః ప్రతిష్ట..

మన్యం న్యూస్, మంగపేట. మార్చి 18

మంగపేట మండలం రాజుపేట గ్రామం వేణుగోపాల స్వామి ఆలయం లో ధ్వజ స్థంభం పునః ప్రతిష్ట కార్యక్రమం లో భాగంగా గురువారం నుంచి ఆగమశాస్త్రం, ప్రకారం వేద మంత్రాల నడుమ శనివారం ధ్వజ స్థంభం పునః ప్రతిష్ట చేయడం జరిగింది.వేద పండితుల ప్రకారం దేవాలయం ధ్వజ స్థంభం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. ఆలయమనే దేహానికి గర్భాలయం ముఖం గాను, ఆలయ ప్రాకారం చేతులు గాను, ధ్వజ స్థంభం హృదయం గాను పోలుస్తారు. నిత్యం హరతులు జరిగే దేవాలయం లో షోడోపశార పూజ విధానం జరగాలంటే ద్వజస్థంభం తప్పనిసరి. దీపారాధన, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజ స్థంబానికి కూడా చేయాలి. దేవాలయం లో నిర్మలమైన వాతావరణం, భగవత్ ధ్యానం వంటివి మానసిక ప్రశాంతత ను కలిగిస్తాయి. ఆలయం లో మూల విరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజ స్థంభం కూడా ఆంతే ముఖ్యం ధ్వజ స్థంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది అందుకే ఆగామశాస్త్రం ప్రకారం వేదాలను అనుసరించి వేద పండితుల వేద మంత్రాల నడుమ, దూప, దీప నైవేద్యాలతో, మేళా తాళాలతో, నియమ నిష్టలతో మూడు రోజులు హోమము జరిపించి భక్తి శ్రద్దలతో ధ్వజ స్థంబానికి ప్రాణ ప్రతిష్ట చేశారు, అనంతరం శ్రీ వేణు గోపాలస్వామి కల్యాణం కన్నుల పండుగ గా జరిపించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్ధ ప్రసాదాలు స్వీకరించి వేణుగోపాల స్వామి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న భక్తులకు అన్నదానం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !