మన్యం న్యూస్ ఇల్లందు మార్చి20: గత నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు చేతిదాకా వచ్చిన మక్కజోన్న పంట నేల రాలటం తో ఇల్లందు మండలం దర్మాపురం రైతులు నెత్తి నోరు బాదుకుంటున్నారు.ఇంకో పది ఇరవై రోజుల్లో చేతికొచ్చే మొక్కజొన్న చేను కాస్తా వర్షానికి నెలకోరిగి దెబ్బతినటం తో మొక్కజొన్న రైతులు వెంకన్న, సారయ్య, లక్ష్మయ్య, కుమారి తదితర రైతులు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు ఎవరూ తమగొడు వినటానికి రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
