మన్యం న్యూస్ గుండాల మార్చి 21: ఆళ్లపల్లి మండలంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అభిమన్యుడు మంగళవారం పరిశీలించి ఎంత మేర దెబ్బతిన్నాయో అంచనా వేశారు. భారీ వర్షాలకు మండలంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట దెబ్బ తినడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహార ని అంచనా వేయాలని అధికారులు ఆదేశించడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి పూర్తిస్థాయిలో పంట నష్ట ని అంచనా వేశారు. కార్యక్రమంలో ఏడీఏ రవికుమార్, ఏవో అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు