మన్యం న్యూస్ మార్చి 21 వాజేడు
మండలంలో చింతూరు గ్రామపంచాయతీ
లక్ష్మీపురం, సీతానగరం గ్రామాలలో మంగళవారం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సందర్శించారు.అనంతరం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించే గ్రామాలలో ప్రజలకు టామ్ టామ్ ద్వారా తెలియపరిచారా, గ్రామాలలో ప్రతి కుటుంబానికి సమాచారాన్ని అందించాలని, కంటి వెలుగు పథకంను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాజేడు పీహెచ్సీ వైద్యాధికారి. కొమరం మహేంద్ర, సూపర్వైజర్స్. లక్ష్మీ, కోటిరెడ్డి. ఏఎన్ఎం.
రాజ్యలక్ష్మి. కంటి వెలుగు డీఈవో. ప్రశాంత్ కుమార్, రాహుల్. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పాల్గొన్నారు.