UPDATES  

 మన ఊరి మనబడి బడ్జెట్లో గండి..

మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.

తెలంగాణ ప్రభుత్వం నేటి బాలలే రేపటి పౌరులు అన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని బాల బాలికల వసతుల విషయంలో పిల్లలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకూడదని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయ పథకమే మన ఊరు మన బడి. బడులను నూతనంగా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా. ఒకవేళ పిల్లలకు అవసరమైతే వెంటనే దాని అమలు కోసం ప్రభుత్వం పిల్లలకు ఏమి అవసరమో వాటిని సమకూర్చే ప్రయత్నమే ఈ పథకం . అయితే ఈ పథకం తప్పు త్రోవ పడుతున్నట్టు పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు పిల్లల కోసం ఇంత మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే.

ఇంకొక వైపు కాంట్రాక్టర్లు తమ చేతివాటం చూపిస్తున్నారు.

పది రూపాయల పని కూడా 10000 రూపాయలు 20000 రూపాయలు వేస్తూ బిల్లులు పెడుతున్నారు, అని గుసగుసలు

గు ప్పమంటున్నాయి ఇష్టానుసారంగా ఎస్టిమేషన్ బిల్లు వేస్తూ అడిగే వారు ఎవరూ లేక వారు ఆడింది ఆట పాడింది పాటగా నడిపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంబంధిత అధికారులు ఎస్టిమేషన్ కోసం వచ్చినా ఈ విషయం పట్ల ఎస్టిమేషన్ పట్ల పెద్దగా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావినీస్తున్నాయి. పిల్లల వసతుల విషయంలో కూడా ఈ దోపిడీని చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పనికి కూడా ఎక్కువ బిల్లులు వేస్తూ నామమాత్రపు పనులు చేస్తున్నారని డబ్బులు మిగిలించుకొని ప్రభుత్వ ఖజానాన్ని గండి కొడుతున్నారు అని ప్రజలు తెలియజేస్తున్నారు.. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే మన ఊరు మనబడి కి కేటాయించిన బడ్జెట్ని, అయినటువంటి పనులను పరిశీలించి పిల్లలకు మెరుగైన వసతులను పిల్లలు అందుపుచ్చుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు .

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !