మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 21, మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో మంగళవారం ఆయుష్ శాఖ ఆర్డిడి ఆదేశాల మేరకు జూలూరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ యునాని డాక్టర్ కె రాజేంద్ర రావు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం పద్మజాతో కలిసి విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లను” పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్ర రావు మాట్లాడుతూ రక్తహీనత బారిన పడకుండా తినవలసిన ఆహార పదార్థాల గురించి, ఔషధ మొక్కలు, గృహ వైద్యం, చిరుధాన్యాల ప్రాముఖ్యత మీద విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
