UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం…

  • ఇటుకలు మీరు మోస్తున్నారా..?
  •  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?
  • ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం.
  • భూమి కేటాయించిన ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడంపై తీవ్ర అసంతృప్తి..
  • క్రీడా బోర్డు ఏర్పాటు పై తాసిల్దార్ పై మండిపాటు..
  • ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై నిర్లక్ష్యం ఎందుకు..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం::

క్రీడా మైదానం నిర్మాణం కోసం మీరు గాని ఇటుకలు మోస్తున్నారా క్రీడా మైదానం ఏర్పాటు కోసం ఏడాది క్రితం భూమి కేటాయించి నిధులు మంజూరు చేసి మీకు ఇచ్చిన ఇంతవరకు ఏ ఒక్క పని ప్రారంభించలేదని భద్రాచలం ఐటిడిఏ ఈఈ తానాజీపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ మండిపడ్డారు. మంగళవారం ఉదయం హుటాహుటిన క్రీడా మైదానాన్ని పనులను పరిశీలించడానికి కలెక్టర్ అనుదీప్ క్రీడా మైదానం ఏర్పాటు కోసం            ములకపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుకాల కేటాయించిన భూమి వద్దకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు క్రీడా మైదానం కోసం కేటాయించిన భూమిలో చుట్టూ వేసిన ఫెన్సింగ్ తప్ప ఇంకా ఏ అభివృద్ధి పని కనిపించలేదు దీంతో ఈ క్రీడా మైదానం నిర్మాణ పనులు అప్పగించిన ఐటీడీఏ ఈ ఈ పిలిచి ఇంతవరకు పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు దీనికి సమాధానంగా ఈ అనేక కారణాలు చెప్పబోగా టెండర్ పిలిచి సంబంధిత కాంట్రాక్టర్ కి అప్పగిస్తే జరిగే పనికి మీరే ఇసుక రాయి ఇటుక మోసి పనిచేస్తున్నట్లుగా కారణాలు చెబుతున్నారు ఏంటి అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముందుగా దుమ్ముగూడెం తహసిల్దారు చంద్రశేఖర్ ని పిలిచి భూమి కేటాయింపు విషయాన్ని సంబంధిత సర్వే నెంబర్లు మ్యాపు తదితర వివరాలను అడిగి తెలుసుకుని మ్యాపుని పరిశీలించారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులయిన ఈ ఈ , డి ఈ లతో మాట్లాడుతూ క్రీడా మైదానంలో ఏ ఏ  ఆటలకు సంబంధించిన కోట్లు వేయబోతున్నారు ఏ ఏ ప్రాంతాలలో వేయబోతున్నారు వివరంగా అడిగి తెలుసుకున్నారు క్రీడా మైదానం కోసం నిర్మించే రహదారుల ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం అధికారుల ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ  మైదానం నిర్మాణం ఎంతో ప్రాధాన్యత చేపడుతున్నామని చెప్పినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించారని అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడకపోతే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అధికారులను హెచ్చరించారు ఇప్పటివరకు అనేక కారణాలు చెప్పి పనులు ప్రారంభించలేదని ఇప్పుడు టెండర్ పిలిచి మిగతా ప్రాసెస్P అంతా పూర్తి చేసే లోపు వర్షాలు పడతాయని దీంతో మళ్లీ మీరు పనులు చేయకుండా చేతులెత్తేస్తారని అన్నారు అధికారులు తొందరగా టెండరు పనులు పూర్తి చేసి త్వరగా నిర్మాణ పనులు చేపట్టి ప్రతి వారం క్రీడా మైదానంలో జరుగుతున్న పనులపై సమాచారం ఇవ్వకపోతే అధికారులతో ఏమీ మాట్లాడకుండా నేరుగా మీ చీఫ్ ఇంజనీర్ తోనే మాట్లాడతానని అన్నారు క్రీడ మైదానాన్ని పరిశీలించిన ఆయన మైదానంలో చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు ఆయన గమనించి పెద్ద వృక్షాలను నరకవద్దని తొలగించవద్దని వృక్షాలను నరకకుండా తొలగించకుండా ఉండేవిధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు నీటి ఏర్పాటు కోసం పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ట్యాంక్ నుండి కనెక్షన్ తీసుకొని మైదానంలో సంపు ఏర్పాటు చేసి నీటి సౌకర్యం కల్పించాలని దీంతోపాటు విద్యుత్ సౌకర్యం కూడా కల్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చంద్రశేఖర్ ఎంపీడీవో చంద్రమౌళి ఎంపీ ఓ ముత్యాలరావు ఐటిడిఈ హరీష్ ఏ ఈ వెంకటేశ్వరరావు రెవెన్యూ అధికారులు ఆదినారాయణ సర్వేర్లు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !