మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
భద్రాచలం నియోజవర్గంలోని చర్ల దుమ్ముగూడెం మండలంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ఆ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ ఐటీడీఏ అధికారి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి మంగళవారం సమర్పించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవికాలం రావడంతో నియోజవర్గంలోని ఏజెన్సీ గ్రామంలో మంచినీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తను గ్రామాల్లో పర్యటించేటప్పుడు తాగడానికి నీళ్లు లేక ప్రజలు ముఖ్యంగా ఉంజుపల్లి చింతగుప్ప, దుమ్ముగూడెం , నారాయణరావుపేట తదితర గ్రామాల్లో త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు వెంటనే అధికారులు ఈ సమస్యపై పరిష్కారం చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ క్రాంతి కుమార్ చర్ల మండల కార్యదర్శి సోమరాజు రాజేష్ కుమార్ శీను రమేష్ తదితరులు పాల్గొన్నారు.