మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఇల్లందు కోర్టు నందు 2023_2024 సంవత్సరానికి సంబంధించి బార్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం జరిగాయి. ఎలక్షన్ ఆఫీసర్ తాడూరి మహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బార్ ప్రెసిడెంట్ గా మామిడి సత్య ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్ గా భూక్య రవికుమార్ నాయక్, జనరల్ సెక్రెటరీగా సువర్ణపాక సత్యనారాయణ దొర, జాయింట్ సెక్రెటరీగా కీర్తి కార్తిక్, ట్రెజరర్ గా కాంపెల్లి ఉమా మహేశ్వరరావు ఎన్నికయ్యారు. అందరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికవటం విశేషం. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సహకరించిన సీనియర్ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు, బార్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకుపోతూ బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అన్ని పోస్టులు కూడా ఏకగ్రీవం అయినందుకు న్యాయవాదులు అందరూ హర్షం వ్యక్తం చేసారు.
