మన్యం న్యూస్, మణుగూరు, మార్చి27:
మణుగూరు మండలం సమితి సింగారం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సోమవారం శ్రీకోదండ రామాలయంలో పసుపు కొట్టు కార్యక్రమం కళ్యాణ పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం హోమములు, బుధవారం ఉత్సవమూర్తులకు గోదావరి స్నానం, గోదావరి పుణ్య జలంతో 108 బిందెలచే మూలవిరాట్లకు అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 30వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని, 31న శ్రీరాముని పట్టాభిషేకం, సాయంత్రం 4 గంటల నుండి ఉత్సవమూర్తులను ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తామని, భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.