మన్యం న్యూస్ ఏటూరు నాగారం
మండలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాల్లో శ్రీసీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. గురువారం మండల కేంద్రంలోని రామాలయంలో దేవతమూర్తులకు కల్యాణ మండపంలో జిలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల కత్రువును అర్చకులు యల్లప్రగడ నాగేశ్వర్‌రావుశర్మ, మణిశర్మల జరిపించారు. కంకణాలను భక్తులకు సమర్పించారు. పూల మాలను అర్చకులు పట్టుకొని నృత్యాలు చేస్తూ స్వామివారికి సమర్పించారు. గ్రామంలో నుంచి భక్తులు సమర్పించిన నూతన వస్త్రాలు, తలంబ్రాలను స్వామివారికి అప్పగించారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ నూతి మధుసూదన్ స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. అలాగే స్థానిక ఎంపీపీ అంతటి విజయ నాగరాజు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోడెం రమేష్, ఉపాధ్యక్షుడు గాడిచర్ల సాంబయ్య, మాజీ చైర్మన్ పోగుల లక్ష్మినారాయణ, గ్రామ పెద్దలు, సేవకులు ఇర్సవడ్ల వెంకన్న, లాహోటి వేణుగోపాల్, పల్ల పవణ్, గడ్డం వినయ్, అలువాల శ్రీనివాస్, చెన్న ముత్తయ్య, ఎగ్గడి వెంకటేశ్వర్లు, చెన్న రాంబాబు, చెన్న భిక్షపతి, ఇర్సవడ్ల నర్సింహరావు, పాపన్న, ఆంజనేయస్వామి మాలధారులు మనోహర్, నవీన్, కందగట్ల రమేష్, చల్లా సాయి, మాచర్ల వెంకటేశ్వర్లు, పూజారులు దీనబాంధుస్వామి, రాదాకృష్ణశర్మ పాల్గొన్నారు.