- కార్యకర్తలపై దాడులకు దిగితే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తారు..?
- – కార్యకర్తలపై దాడి చేయడం సమంజసమేనా..?
- – ఎమ్మెల్యే పొదెం పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం…
- – కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీంద్రారెడ్డి
మన్యం న్యూస్, బూర్గంపాడు :
పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలపై భౌతిక దాడులుకు దిగితే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తారని కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత రవీంద్రారెడ్డి ప్రశ్నించారు. శనివారం బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత రవీంద్రారెడ్డి మాట్లాడుతూ… భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి పినపాక నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పిలిపించి రెడ్డి సామాజిక వర్గాన్ని దూషిస్తూ శ్రీనివాసరెడ్డి పై చెప్పుతో కొట్టడానికి రావడం సమన్వయసమేనా అని ప్రశ్నించారు. మేము అంతా కలిసి ఓట్లు వేయించి పార్టీ కార్యకర్తల పనిచేస్తూ ఉంటే, మాపై ఇటువంటి దాడి ఎంతవరకు న్యాయమని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటి పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంగా ఉంటూ ఎదిరిస్తూ పని చేస్తూ ఉన్నాం అన్నారు. అధికార పార్టీని ఎదుర్కోవాలంటే పార్టీ కార్యకర్తలను నేతలను కాపాడుకోవాల్సిన ఎమ్మెల్యే ఇటువంటి దాడులకు చేయడం సమంజసమేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలపై ఇలాంటి భౌతిక దాడులుకు దిగితే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కైపు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు