మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 3
మణుగూరు మండల పరిధి లోని భద్రాద్రి పవర్ ప్లాంట్ స్టేజ్-1 యుసిబి టీజీ ఫ్లోర్ నందు ఉద్యోగుల భద్రత కోసం బిటిపిఎస్ భద్రత విభాగం, అగ్నిమాపక భద్రత అవగాహన శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిటిపిఎస్ సిఈ బిచ్చన్న పాల్గోన్నారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యోగులు భద్రత పై కనీస అవగాహన కలిగి ఉండాలి అన్నారు.భద్రతా ప్రమాణాలను పాటిస్తూ,వ్యక్తిగత రక్షణతో పాటు యంత్రాల రక్షణ పై కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు.అనంతరం స్వయంగా సి ఈ బిచన్న సిపిఆర్ శిక్షణ లో పాల్గొన్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వివిధ రకాల మంటల నియంత్రణ కోసం వాడే,వివిధ రకాల అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలో ప్రదర్శన లో వివరించారు.అనంత.రాములు ఇంచార్జి సింగరేణి కాలరీ రెస్క్యూ ఆపరేషన్స్ కొత్తగూడెం బృందం తో అత్యవసర కార్యకలాపలపై ప్రత్యేక దృష్టితో పాటు సిపిఆర్ పై శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో బిటిపిఎస్ సి.ఈ బి. బిచ్చన్న,ఎస్.ఈ టి.శ్రీనివాస రావు,ఎస్.ఈ.రమేష్ బాబు,డి ఈ సేఫ్టీ జి.ఆనంద్ ప్రసాద్, డి.ఈ శ్రీధర్,సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్ ఇంచార్జి అనంత రాములు,టీమ్ సభ్యులు పాల్గొన్నారు.