UPDATES  

 పోషణ పక్వాడ్ కార్యక్రమం అద్భుతం జిల్లా కలెక్టర్ అనుదీప్ …

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

పోషణ లోప నివారణకు చేపట్టిన పోషణక్వాడా కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించడం పట్ల జిల్లాకలెక్టర్ అనుదీప్ మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని అభినందించారు. సోమవారం పోషణ్ పక్వాడా ముగింపుకార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా

ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గత నెల 20వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకుజిల్లాలోని 2060 అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ అభయాన్ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. పోషణపక్వాడాకార్యక్రమాల్లో పౌష్టికలోపంతో భాదపడుతున్న చిన్నారులు, కిషోర బాలికలకు చిరుదాన్యాల ఆహారం తీసుకోవడం వల్ల

కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు. పోషణ్ పక్వాడా కార్యక్రమాలను ప్రతి రోజుఆన్లైన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రక్త హీనతతో భాదపడుతున్న గర్భిణిల ఆరోగ్య పరరిరక్షణకు, పోషక లోపాన్నిఅధిగమించేందుకు చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడంపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు

ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించి తీసుకోవాల్సిన ఆహారం గురించి వివరించడం జరిగిందని చెప్పారు. పోషణ్ పక్వాడాకార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యవంతమైన చిన్నారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారని, ఎంపిక చేసినచిన్నారులకు బహుమతులు, ప్రసంశా పత్రాలను అందచేశారు. కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని సుజాతనగర్

మండలం, నరసింహాసాగర్ ప్రాజెక్టు 1 కి వెళ్తున్న 3 సంవత్సరాల వయస్సున్న చిన్నారి ఉజ్వలశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి,జిల్లా కలెక్టర్, జిల్లా పేరు దేశ రాజధాని తదితర పేర్లును ముక్తకంఠంతో చెప్పడం పట్ల చిన్నారిని కలెక్టర్ ప్రత్యేకంగా

అభినందించారు. ఆ ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్ నర్సమ్మను అభినందించారు.

ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి లెనీనా, సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !