UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు 73వ జన్మదిన వేడుకలు పట్టణంలోని జగదాంబ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. టీడీపీ మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి, ఇల్లందు పట్టణ అధ్యక్షులు ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో పట్టణ కమిటీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముద్రగడ వంశీ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని 73వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని 73 కేజీల కేకును కట్ చేయటం సంతోషంగా ఉందన్నారు. తన 28 ఏళ్లకే మంత్రిగా పనిచేసిన చంద్రబాబు అంచెలంచెలుగా ఎదిగి సీఎంగా, ప్రతిపక్షనేతగా ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో అరవైశాతం ఆదాయం వస్తూ కీలకంగా ఉన్న హైదరాబాదును అన్నివిధాలుగా అభివృద్ధి చేసి ప్రపంచపటంలో నిలిపింది చంద్రబాబు అని, విజయాలకు పొంగని, అపజయాలకు లొంగని ఆయన నైజం నేటి రాజకీయ నాయకులకు, యువతకు ఆదర్శమని అన్నారు. అందుకు తెలుగుతమ్ముళ్లుగా తాము ఎంతో గర్వపడతామని పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల్లో అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు అని, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని, ప్రజలకు సేవ సేవ చేసేందుకు ఆ శక్తిని ఆయనకు భగవంతుడు ప్రసాదించాలని ముద్రగడ వంశీ కోరారు. టీడీపీకి గ్రామస్థాయి నుంచి పటిష్టమైన నాయకత్వం ఉందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ఏపీ సీఎం అవుతారన్నారు. అదేవిధంగా తెలంగాణలోనూ తెదేపా పోటీ చేసి క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందావత్ రమేష్ బాబు, సీనియర్ నాయకులు శ్యామ్ తివారీ, బాబన్న, కారు నర్సన్న, అయ్యోరి నాగరాజు, కంది రవి, రామయ్య, శ్రీహరి, రత్నాకర్, నర్సింహారావు, శిల్ప వెంకటేశ్వర్లు, ముత్యాల రమేష్, టీడీపీ యువనాయకులు గోగ్గెల రాజేష్, దేవరకొండ నవీన్, సంజయ్, శ్రావణ్, ఆటో జానీ, తెలుగు మహిళలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !