మన్యం న్యూస్,ఇల్లందు టౌన్ …భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భధ్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య అధ్వర్యంలో క్యాంప్ కార్యాలయం నందు ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా నియమితులైన ఆవుల రాజిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం నిర్వహించిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఇల్లందు నియోజకవర్గ సీనియర్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఇల్లందు నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు జలిల్, ఇల్లందు, టేకులపల్లి మండల పార్టీ అధ్యక్షులు పులి సైదులు, భుక్యా దేవా నాయక్, ఇల్లందు టౌన్ అధ్యక్షులు దొడ్డా డానియల్, బయ్యారం మండల ప్రచార కార్యదర్శి బానోత్ మోహన్, నాయకులు సితారాంరెడ్డి, ధర్మా తదితరులు ఉన్నారు.