UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 లైగర్‌ సినిమా ఎఫెక్ట్‌ ఇంకా ఎంత కాలం?

వరుసగా ఫ్లాప్స్ వస్తున్న సమయంలో పూరి జగన్నాథ్ పనైపోయిందని అంతా భావిస్తుండగా ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి వారందరికి తన సమాధానం ఇదే అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

రామ్ కి కూడా కెరియర్ కి బూస్ట్ ఇచ్చే విధంగా ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఆ సినిమా తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఆ సినిమా పూరి జగన్నాథ్ ని మళ్లీ తొక్కేసింది. లైగర్ సినిమా వచ్చి ఇన్నాళ్ళైనా కూడా పూరి తన తదుపరి సినిమాని మొదలు పెట్టలేకపోతున్నాడు అంటే ఏ స్థాయిలో ఆ సినిమా నిరాశ పర్చిందో అర్థం చేసుకోవచ్చు.

రామ్‌ తో మరో సినిమాను పూరి జగన్నాథ్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఇటీవలే ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. లైగర్‌ ఎఫెక్ట్ పూరి జగన్నాథ్‌ పై ఎంత కాలం ఉంటుందో తెలియదు.

మళ్లీ ఆయన మునుపటి క్రేజ్ ని మునుపటి సక్సెస్ ట్రాక్ ని సొంతం చేసుకుంటాడా లేదా అనే విషయం కూడా క్లారిటీ లేదు. రామ్ తో మరో సినిమా రూపొందించి సక్సెస్ అయినా కూడా ఆ తర్వాత సినిమాపై ప్రేక్షకులు మరియు సినిమా వారు నమ్మకం పెట్టే అవకాశం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !