UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 అందుకే ‘అహం బ్రహ్మాస్మి’ నుంచి తప్పుకున్నా!

మంచు మనోజ్( Manchu Manoj)- శ్రీకాంత్ రెడ్డి కాంబినేషన్ లో ‘అహం బ్రహ్మాస్మి( Aham Brahmasmi)’ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ చిత్రంలోని మంచు మనోజ్ ఫస్ట్ లుక్, టీజర్ కూడా విడుదల చేశారు.

అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. తాజాగా చాట్ షోలో మనోజ్ దీనిపై స్పందించాడు. ఈ ప్రాజెక్టు నుంచి మనోజ్ తప్పుకోడానికి కారణాలను వివరించాడు.

‘ మౌనిక నా జీవితంలోకి వచ్చిన తొలినాళ్లలో సినిమాలా? ప్రేమా? తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక బాబుతో ఒంటరిగా ఉన్న మౌనికకు జీవితం ఇవ్వడమే నాకు ముఖ్యం అనిపించింది. ఆ సమయంలో నేను డబ్బు, కెరీర్ గురించి ఆలోచిస్తూ బతకడం వేస్ట్ అనిపించింది. అందుకే మౌనిక, బాబుని సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళిద్దరికీ మంచి జీవితాన్ని ఇవ్వడం ఇవ్వాలనే ఉద్దేశంతో చెన్నై వెళ్లిపోయాం. అక్కడే ఏడాదిన్నర పాటు ఉన్నాం. ఈ విషయం ఎవరికీ తెలియదు. దీంతో ‘బ్రహ్మస్మి’ ప్రాజెక్టుకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి తో చెప్పాను. తను అర్థం చేసుకున్నాడు. రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ఇప్పుడు శ్రీకాంత్.. వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. భవిష్యత్తులో కచ్చితంగా ‘అహం బ్రహ్మాస్మి’ తిరిగి పట్టాలెక్కుతుంది. దానికంటే ముందు కొన్ని సినిమాలు చేసి డబ్బులు సంపాదించాలి ‘ అని అన్నాడు.

మూడేళ్ల విరామం తర్వాత మనోజ్ 2020 లో ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రాన్ని ప్రకటించాడు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం లో ఈ సినిమాని మంచు మనోజ్ స్వయంగా నిర్మిస్తున్నట్లు చెప్పాడు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్. అల్లరి నరేష్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించాల్సి ఉండగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !