మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించడంలో జిల్లా కలెక్టర్ చూపుతున్న ప్రత్యేక చొరవతోపాటు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంతోనే సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం లోజిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తో ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రత్యేక సమావేశమయ్యారు వారితో జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఇతర మౌలిక వసతుల కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు