మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 27::
పర్ణశాల సీతారామచంద్రస్వామి దేవాలయంలో గురువారం పునర్వసు నక్షత్ర సందర్భంగా మాస కల్యాణం నిర్వహించారు. ఆలయంలో ముందుగా విశ్వక్సేన పూజ పుణ్య ఆవచనం రక్షబంధనం యజ్ఞోపవిత ధర్నా స్వామివారి అమ్మవారి ప్రవరలు మంగళష్టాకాలు మహాసంకల్పం జీలకర్ర బెల్లం మాంగల్య పూజ మంగళ దారుణ మంగళ హారతి నడుమ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయంలో కల్యాణాలు మూడు జరిగాయి కళ్యాణంలో భాగంగా భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కిరణ్ కుమార్ చార్యులు భార్గవచార్యులు ఆలయ సిబ్బంది శివ తదితరులు పాల్గొన్నారు.