UPDATES  

 అసంఘటిత  కార్మికులకు 8 గంటల పనిదినం, రూ.26 వేలు కనీస నెలసరి వేతనం  ఇవ్వాలి.

మన్యం న్యూస్ ఇల్లందురూరల్: మేడే సందర్భంగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ విడుదల చేసిన గోడపత్రికను ఇల్లందు మండల పరిధిలోని చల్ల సముద్రం పెంకు ఫ్యాక్టరీలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు రాంసింగ్ మాట్లాడుతూ పనిదినాన్నిరక్షించుకునేందుకు,ప్రభుత్వరంగ పరిశ్రమలను కాపాడుకునేందుకు అసంఘటిత రంగంలోపనిచేస్తున్నకార్మికులకు కనీసవేతనం రూ.26 వేలు సాధించేందుకు,నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా 137 వ మేడేని స్ఫూర్తిగా తీసుకొని కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత కార్మికవర్గం పోరాడి తెచ్చుకున్న చట్టాలను,అనేక పోరాటాలతో త్యాగాలతో 140 ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసుకున్న 8గంటల పనిదినాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.కార్మిక వర్గానికి చెందిన 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 8గంటల పనిదినాన్ని 12 గంటలుగా మార్చి కార్మికుల శ్రమ దోపిడికి నాలుగు లేబర్ కోడలు తెచ్చి ప్రభుత్వ వనరులు పరిశ్రమలు,సంపదలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నాడన్నారు.  ఈకార్యక్రమంలో నాయకులు మూతి రాంబాబు, సనప రాంబాబు, బుగ్గరవి, బజారి రాజమ్మ,రాధమ్మ, శివ, లక్ష్మయ్య, బుచ్చమ్మ, తోలెం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !