మన్యం న్యూస్ మణుగూరు టౌన్:ఏప్రిల్ 28
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసి-2 లో డంపర్ ఆపరేటర్ గా పనిచేసి పదవి విరమణ చేయనున్న కోపరి. ప్రసాదుకు రిలే సి ఆపరేటర్లు శుక్రవారం నాడు శాలువా, పూలమాలలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.రిలే సి ఇంచార్జ్ పీకే ఓసి డిప్యూటీ మేనేజర్ భూక్య భాంగ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.పదవిలో ఉన్నప్పుడే కాకుండా పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవిత సమయంలో కూడా తనతో పాటు పనిచేసిన సహోద్యోగులు,వారు ఎక్కడ కలిసినా వారిని ఆప్యాయంగా పలకరించాలని,వారి బాగోగులు తెలుసుకోవాలని ఏదైనా కష్టం వస్తే,మేమున్నాం అనే భరోసా ఇవ్వాలని అన్నారు.విశ్రాంత ఉద్యోగులు తమతో పనిచేసిన వారి నుండి అలాంటి ఆప్యాయత పలకరింపులనే కోరుకుంటారని ఆయన అన్నారు.దీంతో వారి జీవితకాలం కూడా రెట్టింపు అవుతుందని,ఇది శాస్త్రీయంగా నిరూపించబడిందని తెలిపారు. 36 సంవత్సరాల పాటు సింగరేణి సంస్థకు సేవలు అందించి అందరితో ఎంతో స్నేహభావంతో కలిసి మెలిసి పనిచేసిన కోపరి ప్రసాద్ విశ్రాంత జీవితం ఆనందమయం కావాలని ఆయన ఆకాంక్షించారు.తనను కుటుంబ సభ్యుల్లా ఆదరించిన రిలే-సి ఉద్యోగులకు ఎంతగానో రుణపడి ఉంటారని ప్రసాద్ భావోద్వేగంతో ప్రకటించారు. ఈ కార్యక్రమానికి నాసర్ పాషా సమన్వయ కర్తగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో అధికారులు బుడ్డి బాబ్జి,సూపర్వైజర్లు కోడి శ్రీనివాస్,దేవేష్,సూర్య,కార్యక్రమం నిర్వహణ కమిటీ సభ్యులు పూజారి అర్జున్ రావు,మిద్దేపాక శ్రీనివాస్,కార్మిక సంఘాల నాయకులు ఐ శంకర్ టీబీజీకేఎస్ మేకల ఈశ్వర్, ఏఐటీయూసీ రిలే-సి ఆపరేటర్లు చల్లా తిరుపతి, సిలువేరు గట్టయ్య,గొల్ల బంగారయ్య,ఎస్ కుమారస్వామి,పి శ్రీనివాస్, యాకయ్య,కే బాబూలాల్,ఎం అంజయ్య,సంపత్ రామ్ లాల్, శ్రీనివాసరెడ్డి,అనిల్ రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.