UPDATES  

 పేకమేడలా కూలుతున్న డీసీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న డీసీ జట్టు.. పేకమేడలా కుప్పకూలుతోంది. తొలి 10 ఓవర్లలో ఏకంగా 5 వికెట్లు కోల్పోయి, కేవలం 54 పరుగులు చేసింది. విధ్వంసకర ఆటగాడు ఫిల్ సాల్ట్ తొలి బంతికే మహమ్మద్ షమీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆఫ్ సైడ్ వైపు కాస్త టెంప్టింగ్ బంతి వేయగా.. అతడు గట్టిగా కొట్టాడు. అయితే.. అది నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లిపోయింది. అలా తొలి వికెడ్ పడగానే డీసీపై ఒత్తిడి పెరిగింది. ఆ వెంటనే ఢిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. రన్ తీయడానికి వీలు లేకపోయినా.. వార్నర్ రన్ తీసేందుకు ప్రయత్నించాడు. ప్రియమ్ గార్గ్ అతనికి వార్నింగ్ ఇవ్వకపోవడంతో.. వార్నర్ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. కేవలం ఒక్క పరుగు కోసం ఢిల్లీ జట్టు ఇక్కడ అత్యంత విలువైన వికెట్ (వార్నర్)ని కోల్పోవాల్సి వచ్చింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !