మన్యం న్యూస్: జూలూరుపాడు, మే 06, మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తగూడెం శ్రీనగర్ కాలనీకి చెందిన భరత్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తగూడెం శ్రీనగర్ కాలనీకి చెందిన భరత్ కుమార్ గార్లఒడ్డు ఆలయంలో దైవదర్శనం చేసుకుని, తిరిగి వస్తుండగా, కొత్తగూడెం వైపు నుండి జూలూరుపాడు వైపు అతివేగంగా, అజాగ్రత్తగా వస్తున్న ఆటో భరత్ కుమార్ ను ఢీకొనగా తీవ్రంగా గాయపడిన తన కుమారుడు భరత్ కుమార్ ను కొత్తగూడెం హాస్పటల్ కు తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతి చెందినాడని, మృతుడి తండ్రి గుగ్గిల వీరభద్రం ఫిర్యాదు మేరకు జూలూరుపాడు ఎస్సై పోటు గణేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపా