UPDATES  

 చంద్రబాబు కాన్వాయ్‌లోకి వైకాపా వాహనాలు..

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో వైకాపా వాహనాలు దూసుకొచ్చాయి. ఈ ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి ఇలా వాహనాలు రావడం చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే.. తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ నెల 12న రైతు పోరుబాట నిర్వహించనున్నారు. ఇందుకోసం చంద్రబాబు తణుకు వెళ్తుండగా.. ఉంగుటూరు వద్ద ప్రయాణిస్తుండగా వైఎస్సార్‌సీపీకి చెందిన రెండు వాహనాలు అనుసరించాయి.

ఈ వాహనాలు తాడేపల్లిగూడెం వరకు అనుసరించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. దాదాపు 15 కిలో మీటర్ల అనుసరించినట్లు తెలుస్తోంది. భద్రత నిబంధనల ప్రకారం చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్లే దాకా సాధారణ వాహనాలను అనుమతించకూడదని టీడీపీ నేతలు అంటున్నారు.

ఒకవేళ ఆ వాహనాలు పొరపాటున వచ్చినా.. పోలీసుల ఎస్కార్ట్ వెంటనే తప్పించాల్సి ఉంటుంది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌ఎస్‌జీ సిబ్బంది.. ఆ వాహనాలను నియంత్రించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !