UPDATES  

 దేశంలోనే తొలిసారిగా వైద్యవిద్య, ఇంజినీరింగ్‌ను కలిపి ఒకేకోర్సు

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన మద్రాస్ ఐఐటీలో వినూత్నంగా ఒక కొత్త కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైద్యవిద్య, ఇంజినీరింగ్‌ను కలిపి ఒకేకోర్సుగా ఐఐటీ మద్రాస్‌ తీసుకొచ్చింది. ఈ కోర్సును నాలుగేళ్ల బీఎస్‌ ప్రోగ్రాం కింద ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.

ఇందుకోసం మెడికల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని కాగ్నిజెంట్ సహ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణన్‌, ఐఐటీఎం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.కామకోటి ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో అత్యున్నత మేధావుల ఆధ్వర్యంలో ఈ కోర్సుకు సంబంధించిన కరిక్యులమ్‌ తయారైందని వారు వెల్లడించారు.

ఈ కోర్సుకు వన్నె తేవడానికి ప్రముఖ ఆసుపత్రులు, దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం https://mst.iitm.ac.in/ అనే వెబ్‌సైట్ చూడొచ్చని వారు వివరించారు. కాగా, ప్రస్తుతం దేశంలో వైద్య, ఇంజనీరింగ్ కేర్సులను వేర్వేరుగా పూర్తి చేయాల్సివుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !