UPDATES  

 శ్రీహరివాసం గ్రూప్ ఛైర్మెన్ హరికృష్ణను పరమర్శించిన జెడ్పీ ఛైర్మెన్ కోరం

మన్యం న్యూస్,ఇల్లందు:శ్రీహరివాసం గ్రూప్ ఛైర్మెన్, బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షులు పెండ్యాల హరికృష్ణ అస్వస్థతకు గురయ్యారు. గతవారం రోజులుగా అనారోగ్యంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందిన అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు సూచించడంతో ఇల్లందుకు చేరుకున్నారు. హరికృష్ణ అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపరిషత్ చైర్మన్ కోరం కనకయ్య శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగినది. అనంతరం కుటుంబసభ్యులను హరికృష్ణ ఆరోగ్యస్థితిని అడిగి తెలుసుకొని దైర్యంగా ఉండాలని సూచించారు. పేదలకు సాయంచేసే గుణమున్న మంచి వ్యక్తి హరికృష్ణ అని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, పూనెం సురేందర్, తాటి బిక్షం, మండల రాము తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !