UPDATES  

 చర్ల లోనే డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలి. 

  • చర్ల లోనే డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలి.
  • విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడితే చూస్తూ ఊరుకోము
  • పి డి ఎస్ యు భద్రాచలం డివిజన్ కన్వీనర్ మునిగల శివ

మన్యం న్యూస్ చర్ల :
చర్ల మండలం అంబేద్కర్ సెంటర్లో డిగ్రీ విద్యార్థులు చర్ల లోనే డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ పి డి ఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పి డి ఎస్ యు డివిజన్ కన్వీనర్ మునిగల శివ మాట్లాడుతూ ఎజన్సీ లో పేద విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చదువులు కొనసాగిస్తున్నారని అన్నారు. చర్ల లోని డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని తీసేసి భద్రాచలం వచ్చి విద్యార్థులను పరీక్షలు రాయాలని అనడం మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లు వున్నదని అన్నారు.చర్ల నుంచి భద్రాచలం 53 కిలోమీటర్లు దూరం ఉంటుందని విద్యార్థులు భద్రాచలం వెళ్లి పరీక్షలు రాయంటే తీవ్రమైన అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ముఖ్యంగా ఆర్ధిక పరమైన అనారోగ్య పరమైన రవాణా పరమైన సమస్యలు ఎదురవుతాయని అన్నారు. ఈ సమస్యలు కారణంగా విద్యార్థులకు చదువుతున్న చదువుపై శ్రద్ధ తగ్గుతుందని సమర్ధవంతంగా పరీక్ష లను రాయలేని పరిస్థితి ఏర్పడి విద్యార్థులు వారి మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని కోల్పోతారని అన్నారు ఈ ప్రభావం విద్యార్థుల భవిష్యత్ పై తీవ్ర మైన దెబ్బకొడుతుందని అన్నారు. దీన్ని మేము తీర్వంగా ఖండిస్తున్నామని అన్నారు. విద్యార్థుల జీవితాలతో చాలగాటం ఆడితే పి డి ఎస్ యు చూస్తూ ఊరుకోదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని చర్ల లో ఎక్సమ్ సెంటర్ లేకపోతే విద్యార్థులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చర్ల లోనే డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసారు. లేనియాడలా భవిష్యత్ లో జరిగే పరిణామలకు అధికారులే భాద్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు సాయితేజ, సందీప్, ఓంకార్, మహేష్, నందిని, అనూష, జితేంద్ర, హేమలత, మణిరత్నం, సుధారాని, నికిత, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !