మన్యం న్యూస్ గుండాల: జిల్లా స్థాయి సీఎం కప్ యువజన ఆటల పోటీలు అట్టహాసంగా మండల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలను స్థానిక ఎంపీపీ ముక్తి సత్యం, ఎంపీడీవో సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కప్ క్రీడా పోటీలలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా సాధించవచ్చు అని వారు సూచించారు. క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ఇవ్వబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సీతారాములు, వివిధ పాఠశాలల క్రీడాకారులు యువకులు పాల్గొన్నారు
