ఆటలతోనే సంపూర్ణ ఆరోగ్యం
సీఎం కప్ క్రీడల ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ రేగా
క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం
మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని తాటి గూడెం గ్రామంలో సీఎం కప్ క్రీడా పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై తొలత స్థానిక ఎంపీపీ రేగా కాళికా, ఎడుళ్ల బయ్యారం సిఐ బూర. రాజగోపాల్ చెతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేయించి, అనంతరం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సీఎం కేసీఆర్ పాలనలోనే క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. క్రీడాకారులల్లోని నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సహించడంతోపాటు ప్రాక్టీస్ చేసేదేందుకు క్రీడా మైదానాలు ఏర్పటు చేశారని అన్నారు. క్రీడలను క్రీడాకారులను గత పాలకులు ఎన్నడు పట్టించుకోలేదన్నారు. క్రీడలను గుర్తించి సీఎం కప్ క్రీడా పోటీలతో ఉత్తమ క్రీడాకారులను గుర్తించి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.విద్యతోపాటు అన్ని రంగాలలో రాణించాలని ప్రతి చిన్న గ్రామంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఎకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి రేగా కాళికా, బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, తహశీల్దారు ఉషా శారద, డిప్యూటీ తహసిల్దార్, సంధ్య,ఎడుళ్ల బయ్యారం సిఐ బూర రాజగోపాల్, కరకగూడెం ఎస్ఐ జీవన్ రాజ్ పిఈడి,కొమరం.వెంకటనారాయణ,పిఈటి వట్టం.సంపత్ కుమార్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,క్రీడాకారులు పాల్గొన్నారు.