UPDATES  

 గ్రామీణ యువత క్రీడా ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకే సీఎం కప్* క్రీడలకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గ్రామీణ యువత క్రీడా ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకే సీఎం కప్*
క్రీడలకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ఘనంగా సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్

మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు పట్టణంలోని స్థానిక జేకే సింగరేణి గ్రౌండ్లో సీఎం కప్ క్రీడాపోటీలను ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియా హరిసింగ్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ పాలనలోనే క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని, క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అన్నారు. క్రీడాకారులల్లోని నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు సీఎం కప్ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారు ప్రాక్టీస్ చేసేందుకు స్టేడియాలను ఆధునికరించిందన్నారు. క్రీడలను, క్రీడాకారులను గత పాలకులు ఎన్నడు పట్టించుకోలేదని, సీఎంకప్ క్రీడాపోటీలతో ఉత్తమ క్రీడాకారులను గుర్తించి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. విద్యతోపాటు అన్ని రంగాలలో రాణించాలనే ఉద్దేశంతో ప్రతిచిన్న గ్రామంలో కూడా క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని క్రీడలలో వారు అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎంపీడీవో బాలరాజు, ఇల్లందు తాసిల్దార్ కృష్ణవేణి, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ అంకుషావలి, ఎంపీపీ చీమల నాగరత్నం, ఇల్లందు పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, స్థానికవార్డు కౌన్సిలర్ చీమల సుజాత, వైస్ ఎంపీపీ ప్రమోద్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కుంజ కృష్ణ, మండలం కోఆప్షన్ సభ్యులు ఘాజి, సర్పంచ్ మంతిని కృష్ణ, చీమల వెంకటేష్, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, సోషల్ మీడియా ఇంచార్జి గిన్నారపు రాజేష్, ఇల్లందు పట్టణ నాయకులు గిన్నారపు రవి, కరాటే రమేష్, అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !