UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 గ్రామీణ క్రీడల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం : ఎమ్మెల్యే వనమా

గ్రామీణ క్రీడల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం : ఎమ్మెల్యే వనమా

జిల్లా యువజన , క్రీడల శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి సీఎం కప్ పోటీలను ప్రారంభించిన : ఎమ్మెల్యే వనమా*

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

గ్రామీణ క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తూ ఉద్యోగ అవకాశాలకు అర్హులుగా చేపడుతున్నారని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావుఅన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవిపల్లి మండలంలో శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలలో జిల్లా యువజన , క్రీడల శాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలనుఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని, గ్రామీణ క్రీడల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు ఎంతోమంది క్రీడాకారుడు ప్రతిభ చూపుతూ దేశ విదేశాల్లో కూడా తెలంగాణ ఖ్యాతిని నిలబెడుతున్నారని అన్నారు. క్రీడాకారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రోత్సాహక బహుమతులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేశారని అన్నారు. క్రీడా అనేవి మానసిక ఉల్లాసానికి నిలబడతాయని క్రీడల్లో గెలుపు ఓటమినులు సహజంగా తీసుకొని క్రీడా స్ఫూర్తిని నింపుకోవాలన్నారు. క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే వనమా వాలీబాల్ క్రీడను ఆడటంతో కార్యకర్తలు ఆనంద ఉత్సవాల్లో సీఎం కప్ లో ఉల్లాసంగా పాల్గొన్నారుఈ కార్యక్రమంలో ఎంపిపి భూక్య సోనా, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, తహసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో రమేష్, ఎంపీ ఓ శ్రీనివాసరావు, మండల స్పెషల్ ఆఫీసర్ మనోహర్, మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ గోవిందు, సర్పంచ్ తాటి పద్మ, శివాలయం గుడి కమిటీ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, హెడ్మాస్టర్ కొండలరావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఐ కే సత్యనారాయణ కార్యదర్శులు,క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !